సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; భీమవరం నేడు, మంగళవారం జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి సబందిత అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఖరీఫ్ 2022-23 ప్రభుత్వం ధాన్యం రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చెయ్యటానికి జిల్లా సేకరణ కమిటీ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఖరీఫ్ పంట కాలంకు పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 5,47,000 MTs ధాన్యం పండవచ్చని అంచనా కాగా 4,92,000 MTs ధాన్యం సేకరణ జరుగువచ్చని అంచనా వేశారు. ఇందుకు గాను 115 సొసైటీల వారు 296 ధాన్యం సేకరణ కేంద్రాలను, రైతు భరోసా కేంద్రాల లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సారి గ్రామ వాలంటీర్లకు ధాన్యం సేకరణలో భాగస్వామ్యం చేయాలన్నారు. అధికారులు సమన్వయతో పనిచేసే మంచి ఫలితాలు తీసుకురావాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *