సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సినీ ప్రియులకు శుభవార్త! ఎల్లుండి శుక్రవారం సెప్టెంబర్ 23న జాతీయ సినిమా దినోత్సవం కావడంతో మన దేశంలో సినిమాలకి స్పెషల్ డే కావడంతో ది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ ప్రేక్షకులకు ఒక బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే ఆ ఒక్కరోజు దేశంలో అన్ని మల్టి ఫ్లెక్స్ థియేటర్స్ లో సినిమాలను కేవలం 75 రూ టికెట్ కొనుకొనిచూడవచ్చు, గతంలో రూ.250 నుంచి రూ.350 వరకు ఉన్న సినిమా టిక్కెట్ ధర చెల్లించకుండానే ఆ శుక్రవారం రోజు రూ.75కే సినిమా చూడొచ్చు. దీంతో టిక్కెట్ల అధిక ధర కారణంగా తమకి ఎంతో ఇష్టమైన సినిమాలని చూడలేకపోయిన ఎంతోమంది ఇప్పటికే టిక్కట్లను బుక్ చేసుకున్నారు. అందుకే ఆ రోజున ఉన్న అన్ని షోలకి సంబంధించి ఆన్‌లైన్‌లో హౌస్ ఫుల్ అని చూపించడం విశేషం.
