సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్ వీక్షించడం కోసం వాటి టికెట్స్ కొనుగోలు జింఖానా గ్రౌండ్స్ వద్ద క్రికెట్ అభిమానులు ఎగబడటంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. నేడు, గురువారం ఉదయం నుండి టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా గ్రౌండ్స్ కు చేరుకున్నారు. మూడు వేల టికెట్ల కోసం 30వేల మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. మహిళలు కూడా టికెట్స్ కోసం క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే అంచనాలకు మించి అభిమానులు తరలిరావడంతో పాటు.. టికెట్ల కోసం ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది.ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గేటు వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ స్పృహకోల్పోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. అలాగే తొక్కిలసలాటలో పలువురు అభిమానులు గాయపడగ, పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారు.
