సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో కుప్పం తో సహా 175 సీట్లను గెలుచుకొంటామని ప్రతిన పూనిన సీఎం జగన్ అదే దిశగా వైసిపి క్యాడర్ కు సంకేతాలు ఇవ్వడమే కాదు.. నేడు, శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో సీఎం జగన్ పర్యటించారు. ఆయన కుప్పం పర్యటనలో అపూర్వ స్వగతం లభించింది. కుప్పం మున్సిపాలిటీలో నేడు, శుక్రవారం రూ.66 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఆఫీస్‌ కాంప్లెక్స్‌‌ను ప్రారంభించారు. తదుపరి, అక్కడ భారీ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కుప్పం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వై ఎస్ ఆర్ చేయూత ‘ పధకం ద్వారా వరుసగా 3వ ఏడాది 45 ఏళ్ళు దాటిన 26లక్షల 39వేలు మంది అక్కచెల్లెమ్మలకు 4, 949 కోట్ల రూపాయలు వారి వారి ఖాతాలలో జమా చేస్తున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ఈ పధకం క్రింద 3 విడుతలలో 14,111 కోట్ల రూపాయలు జామా చేసినట్లు ప్రకటించారు. ‘‘కుప్పంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. కుప్పం ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. కుప్పం లో కానీ రాష్ట్రంలో కానీ చంద్రబాబు కు నివాసం లేదు. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు హైదరాబాద్‌ కు లోకల్‌. కుప్పానికి చంద్రబాబు నాన్‌ లోకల్‌ అని ఎద్దేవా చేసారు. కుప్పానికి కనీసం నీళ్లు కూడా తీసుకురాలేదు. ఆ ఆలోచన కూడా చేయలేదు. మున్సిపాలిటీలో కనీసం డబుల్‌ రోడ్డు కూడా వేయలేదు. కృష్ణగిరి- పలమనేరు హైవే పనుల్ని చేయలేదు.14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పంలో కరువు సమస్యను పరిష్కరించలేదు. కుప్పంలో ఎయిర్‌పోర్టు కడతామని చెవుల్లో పూలు పెట్టారు. కానీ వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది. ఎక్కడ ఎన్నో అభివృద్ధి పధకాలు ప్రవేశపెట్టాం. నాకు కుప్పం అంటే అక్కచెల్లెమ్మల అభివృద్ధి. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *