సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల జరుగుతున్నా రాజకీయ పరిణామాలు ఫై ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ తన ట్విటర్ లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు... ఎన్టీఆర్ పేరు యూనివర్సిటీ మార్చేయ్యడానికి తీసెయ్యడానికి ఎన్టీఆర్ ఒక పేరు కాదు. అదో సంస్కృతీ నాగరికత.. తెలుగు జాతికి వెన్నుముక్క‘ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’ అంటూ సోషల్ మీడియా వేదికగా నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. జగన్ సర్కార్ ఫై ఆగ్రహం సరే కానీ.. ఎవరి పేరు ఉచ్చరించకుండా.. ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో బ్రతుకు తున్న నేతలు ఎవరో? శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’ ఎవరిని ఉద్దేశించి లోతుగా ఈ వ్యాక్యలు చేసారో ? ఎవరికీ తగ్గట్టు వారు మీడియాలో అన్వయించుకొంటున్నారు. అసలు బాలయ్య మనస్సులో ఏముందో?
