సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా సమీపంలోని దుగ్గిరాల గ్రామంలో… అధికారంలో ఉన్న లేకపోయిన తరచూ ఎదో వివాదాలలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు టచ్ లో ఉండే( మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ ఫై దాడి మొదలుకొని మహిళా తాసిల్దార్ ఫై దాడి ఇటీవల తెలంగాణాలో రాత్రిళ్ళు ఫ్లడ్ లైట్స్ వెలుగులో కోడిపందాల వరకు ) .. తాజగా.. మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇంటి వద్ద పోలీసులు ఆయనను కలసి అమరావతి రైతుల పాదయాత్ర కు వెళ్లకూడదని నోటీసు ఇవ్వడానికి ప్రయత్నించగా అందుకు చింతమనేని నిరాకరించారు. పోలీసులతో, ‘‘రైతుల పాదయాత్రకు నేను వెళుతున్నాను అని మీకు చెప్పానా? నా వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ ఏది పడితే అది రాసిస్తే, నేను నోటీసు ఎలా తీసుకుంటాను.నోటీసు ఇచ్చే అధికారం మీకు లేదు’’ అంటూ పోలీసులతో చింతమనేని ప్రభాకర్ వాదనకు దిగారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *