సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జి తోట సీతారామలక్ష్మి సమక్షంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అడ్జక్షతన నేడు, శనివారం జరిగిన టీడీపీ పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమీక్షా సమావేశంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఉండి ఎమ్మెల్యే రామరాజు తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమీల్లి రాధాకృష్ణ మరికొందరు ఏలూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల రాజకీయ పరిణమాలు వేగంగా మారుతున్నాయని, సంక్షేమ పధకాలు అందరికి అందటంలేదని , ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుందని, ఎన్టీఆర్ హెల్త్ విశ్వ విద్యాలయం పేరు మార్చి సీఎం జగన్ తన నిజ స్వరూపం బయట పెట్టుకొన్నారని, ఎన్నికలు రావడానికి 2 ఏళ్ళు సమయం కూడా లేదని క్యాడర్ ను గ్రామా గ్రామాన బలోపేతం చేసుకొని , ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ వైపల్యాలలును అర్ధం అయ్యేలా విభిన్న ప్రచారాలు నిర్వహించాలని సీఎం గా చంద్రబాబు ను అధికారంలోకి తీసుకోని వచ్చేవరకు విశ్రమించకూడని, గతంలో తప్పులు పునరావృత్తం కాకుండా ప్యూహాత్మకంగా ముందుకువెళ్లాలని ప్రతినిధులు తమ సమీక్షలులో వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *