సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ వైసిపి వర్గాలను తీవ్రంగా విమర్శిస్తూ చేసిన ట్విట్ ఫై మంత్రి జోగి రమేష్ మరింత ఘాటుగా స్వాందించారు . బాలకృష్ణ ఒక దద్దమ్మ అని, ఈ బాలకృష్ణకు ఎన్టీఆర్ జన్మనిస్తే, కష్టా సమయంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పునర్ జన్మ నిచ్చారని…( ఇద్దరిపై కాల్పులు జరిపి హత్య యత్నం కేసు విషయం పరోక్షంగా గుర్తు చేస్తూ..) దానితోనే బయట పడ్డ బాలయ్య విశ్వాసం లేకుండా, కృతజ్ఞత లేకుండా .. తన తండ్రి NTR పేరు జిల్లా కు పెట్టి గౌరవించిన మహోన్నతుడు సీఎం. వై ఎస్ జగన్ ఫై మొరుగుతున్నాడని ,పెట్టుడు మీసాలు ఎక్కువ మెలి వెయ్యవద్దు..ఊడిపోతాయి.. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ట్విటర్ లో పెట్టి గొప్పగా భావిస్తున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి,నందమూరి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి, పార్టీని , గుర్తును చంద్రబాబు లాగేస్తూకొంటే బాలకృష్ణ నవ్వుతు నిలబడటం అందరికి తెలిసిందేనని, అయితే ఇప్పడు మాట్లాడితే తండ్రి గురించి గొప్పలు చెప్పి పబ్బం గడుపుకొంటాడని, తండ్రికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వేసిన ఎంగిలిమెతుకులు కు కక్కుర్తి పడి శునకానందం పడటం బాలకృష్ణకు చెల్లిందని, ఇటువంటివాడికి వై యస్ రాజశేఖర్ రెడ్డి కి తగ్గ కొడుకుగా సీఎం జగన్ లాంటి ప్రజా సంక్షేమమం కాంక్షించే ఉత్తముని ప్రశ్నించే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *