సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ దేవి శరన్నవరాత్రులో భాగంగా నేడు, సోమవారం శ్రీ అమ్మవారు “స్వర్ణకవచాలంకృత అలంకారం” లో దర్శనమిచ్చారు. నవరాత్రులు లో భాగంగా నేటి నుండి వచ్చే నెల 5వ తేదీ విజయదశమి వరకు 10 రోజుల మహోత్సవాలు ప్రారంభిస్తూ దేవాలయంలో కలస్థాపన పూజ ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్, మానేపల్లి నాగేశ్వరరావు దంపతులచే నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమం లో ఆలయ సహాయ కమిషనర్ & కార్య నిర్వహణాధికారి, యర్రంశెట్టి, భద్రాజీ ఆలయ ధర్మకర్తలు రామాయణం సత్యనారాయణ ముత్యాల వెంకట రామారావు గోపిశెట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దేవాలయాన్ని ప్రత్యేక పుష్ప జాతులతో అలంకరణ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *