సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : మంత్రి బొత్స సత్యనారాయణ తాజగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని 3 రాజధానుల ప్రతిపాదన తెస్తే తెలుగు దేశం పార్టీ నేతలు మాత్రం జగన్ సర్కార్ ను ఇబ్బందులు పాలు చెయ్యడానికి ఎన్నో కుట్రలు చేస్తూఅంరని, ఇప్పుడు విశాఖ ప్రాంతంలో స్థానికులకు అమరావతి రైతులకు మధ్య గొడవలు రెచ్చగొట్టడానికి ప్యాకేజీ లు ఇచ్చి అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని, సీఎం జగన్ సర్కార్ తలచుకొంటే 5 నిమిషాలలో పాదయాత్రను నిషేదించవచ్చునని, కానీ ప్రజా స్వామ్యం లో అందరి హక్కులు కాపాడటానికి వారి ప్రాదయాత్రను అనుమతించారని చేసిన వ్యాఖ్యలపై పై అమరావతి జేఏసీ ప్రతినిధులు, టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తలుచుకుంటే పాదయాత్రను అయిదు నిమిషాల్లో ఆపేస్తామనడంపై మండిపడ్డారు. హైకోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్నామని… మంత్రి బొత్స పై కోర్టు ధిక్కార పిటిషన్ వేయడానికి ఆలోచిస్తామని అమరావతి రైతు జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు తెలిపారు. మంత్రి బొత్స వ్యాఖ్యలను పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు మీడియాతో తాజగా మాట్లాడుతూ.. మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని , అమరావతి రాజధాని కోసం తమ భూమి ఇచ్చిన రైతులు ఉద్యమాన్ని ఇలా పరిహాసం చెయ్యడం తగదని అన్నారు. (up file photo)
