సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం మండలంలో రూ 35 లక్షల వ్యయంతో చేపడుతున్న మందచేడు మీడియం డ్రైన్ల ప్రక్షాళన పనులకు నేడు, సోమవారం సోమవారం దెయ్యాల తిప్ప గ్రామం వద్ద శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. నియోజకవర్గ పరిధిలో ప్రతి డ్రైన్ల ను కూడా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.రైతుల అభివృద్ధి కోసమే డ్రైన్ల ను ప్రక్షాళన చేస్తున్నామని, రైతులకు పంట సాగు చేసే చేసే విషయంలో ముంపు సమస్య తలెత్తకుండా ముఖ్యంగా వర్షాకాలంలో పంట చే లలో నీరు విలువ ఉన్న సమయంలో ఆ నీటిని డ్రైన్ల లు త్వరితగతిన లాక్కునే విధంగా డ్రైన్ల ప్రక్షాళన పనులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ మందచేడు డ్రైన్ ప్రక్షాళన వల్ల దెయ్యాలతిప్ప వినాయకపురం రెడ్డి చెరువు నాగేంద్రపురం నాగిడి పాలెం రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో తిరు మాని ఏడుకొండలు జడ్పిటిసి కాండ్రేగుల నరసింహారావు, తాసిల్దార్ వై రవికుమార్ ,డ్రైనేజీ డి ఈ సుబ్రహ్మణ్యేశ్వర రావు, జేఈ దుర్గారావు, సర్పంచులు తిరు మాని శ్రీనివాస్, జల్లా కొండయ్య, రామాని శివాజీ వర్మ, నాగిడి నారాయణస్వామి, ఎంపీటీసీలు తిరు మా ని తులసీరావు, బొమ్మిడి కొండరాజు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *