సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 3వ పట్టణం లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవములు సందర్భంగా ఈరోజు ఉదయం కలసస్థాపనతో ఉత్సవములు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భముగా దేవాలయ అభివృద్ధికి పెనుమత్స అప్పల సీతారామరాజు పార్వతి దంపతులు స్వామివారికి ఫిక్స్ డిపాజిట్ నిమిత్తం 50 వేల రూపాయలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు ,ఆలయ అర్చకులు పాణింగిపల్లి శ్రీనివాసాచార్యులు, కమిటీ సభ్యులు ,కుక్కల బాల వెంకటరత్నం తాడికొండ కోటేశ్వరరావు గుప్తా గొన్నా బత్తుల మల్లేశ్వర రావు మామిడి శెట్టి జయకుమార్ అల్లూరి బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు. మహిళలు భక్తులు దాతలు పూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దసరా రోజులలో ప్రతిరోజు సాయంత్రం లోక కళ్యాణార్ధం లక్ష్మీ సహస్ర కుంకుమార్చన జరుగుతున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *