సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని గునుపూడి ప్రాంత గ్రామ దేవత శ్రీఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ వార్ల దేవస్థానాన్ని నేడు, సోమవారం శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేనురాజు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మ వార్లకు మోషేనురాజు పూజాలు చేశారు. అర్చకుల ఆశీస్సులు అందుకున్నారు. దసరా మహోత్సవాల ఏర్పాట్లను మండలి చైర్మన్‌ అడిగి తెలుసుకున్నారు. సోమవారం మొదలు అక్టోబర్‌ 5 వరకు ఆలయంలో ప్రతిరోజు సహస్రనామ కుంకుమ పూజలు, అమ్మవారికి విశేష అవతారములు, అలంకరణలు చేస్తున్నట్లు ఇవో గొట్టుముక్కల నాగసీతారామరాజు, కమిటీ సభ్యులు ఆయనకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *