సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం త్యాగరాజ భవనములో శ్రీ వాసవి మాత దేవాలయంలో ఆర్యవైశ్య వర్తక సంఘం ఆధ్వర్యంలో దసరావేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజుకో దేవి అవతారంలో అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు నిర్వహిస్తున్నారు. గత రాత్రి భారీ వారాహిదేవి అవతారం ప్రతిమను ఏర్పాటు చేసి శ్రీ అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు నైవేద్యాలుగా సమర్పించి, వేలాది మంది భక్తులకు ఆ 9 ప్రసాదాలను వితరణ చెయ్యడం జరిగింది. అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ వేడుకలను ఆర్యవైస్యులు ప్రతిష్టాకరంగా నిర్వహిస్తున్నారు.
