సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో శరన్నవరాత్రుల వేడుకలలో భాగంగా నేడు, శనివారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో భక్తులకు నిలువెత్తు శ్రీ అమ్మవారు దర్శనమిచ్చారు. ఎంతో దూరప్రాంతాల నుండి భక్తులు వచ్చి శ్రీ అమ్మవారిని ఈ దసరా వేడుకలలో దర్శించుకొంటున్నారు. నిన్న శుక్రవారం అయితే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భక్తులు రద్దీ ఎక్కువై క్యూ లైన్ ఆదివారం బజారు పొట్టి శ్రీరాముల విగ్రహం వరకు చేరిపోవడం గమనార్హం. గత సాయంత్రం గౌరవ తెలంగాణ హైకోర్ట్ జడ్డి , శ్రీదేవి శ్రీ అమ్మవారిని ఆలయ మర్యాదలతో దర్శించారు. ఇక నేటి శనివారం సాయంత్రం 4గంటలకు సంగీత విభావరి, 6-30 కు శ్రీ అమ్మవారి అలంకార విశిష్టత ప్రవచనం 7గంటల నుండి స్వాతి ఆర్కెస్ట్రా వారి మ్యూజికల్ నైట్ భక్తి పాటలతో నిర్వహిస్తారు.
