సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చదువుకొన్న నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్–1 కేడర్ పోస్టుల భర్తీకి ఆం ధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్లో గ్రూప్–1 పోస్టులతో పాటు అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పె క్టర్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్య దర్శి హెచ్. అరుణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్–1 పోస్టులు 92 ఉండగా అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పె క్టర్ పోస్టులు 17 ఉన్నాయి. ఇక గ్రూప్–1 పోస్టుల దరఖాస్తుకు అక్టోబర్ 13 నుం చి నవంబర్ 2 వరకు, ఎఎంవిఐ పోస్టులకు నవంబర్ 2 నుంచి 22 వరకు గడువు విధించారు. పూర్తి వివరాలను కమిషన్ వెబ్సైట్ psc.ap.gov.in/ లో చూడాలి. గతం లో జారీచేసిన జీఓ 105అమలును మరో రెం డేళ్లు పొడిగిస్తూ ఉత్తర్వు లిచ్చింది. గతం లో 34ఏళ్ల వయోపరిమితిని 42ఏళ్లకు పెంచి జీఓ 105 జారీచేశారు. తాజా ఉత్తర్వు లతో ఈ 42ఏళ్ల గరిష్ట వయోపరిమితి 2023 సెప్టెంబర్ 30వరకు అమల్లోఉం టుంది. ఎఎం వీఐ పోస్టులకు గడువు నవంబర్ 2 నుంచి 22 వరకు పెంచడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *