సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదం గ్రామంలోని అల్లంగుంట పాలెంలో వైసిపి పార్టీ, నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఎంపీ నిధులతో 20 లక్షల వ్యయంతో బీసి కమ్యూనిటి హాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. BCలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక,అని మీ సహకారం తోనే పాలకొల్లు ఎమ్మెల్యే గా గెలిచానని తెలుగుదేశం వెంట BCలు ఉంటారు కాబట్టి టీడీపీ అధికారం లేకపోయినా కూడా తాను MPఫండ్స్ నుండి నిధులు మంజూరు చేయించుకొని ఇక్కడ బీసి కమ్యూనిటి హాల్ నిర్మాణం చేయిస్తున్న సందర్భంగా తనకు సహకరించిన నరసాపురం పార్లమెంట్ సభ్యులు ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణరాజు కి ధన్యవాదాలు తెలియజేసారు.
