సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మగవాడు దొంగ పెళ్లిళ్లు చేసుకొన్నాడు అన్నది సామాన్యమైన వార్త .. అయితే ఆడప దడపా మహిళలు కూడా 3నుండి 4 వరకు దొంగపెళ్లిలు చేసుకొన్నా వార్తలు మనం చూస్తూనే ఉంటాం.. మరి గత పాత రికార్డ్ వార్తలను తిరగరాస్తూ భీమవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన పేకేటి వెంకట లక్ష్మి అనే కిలాడీ మహిళా పలువురు సంపన్న వ్యక్తులకు మాయమాటలు చెప్పి ఒకరిద్దరిని కాదు ఏకంగా ఏడుగురిని పెళ్లి చేసుకుంది. ఈమెపై భీమవరం, గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఈమె బాధితుడు కొత్తకోట నాగేశ్వర రావు (శివ)చెప్పిన వివరాలలోకి వెళితే.. రోకళ్ల వెంకట లక్ష్మి (అలియాస్ గుంటూరు కందుకూరి నాగ లక్ష్మి ) గతంలో అతని వద్ద పనికి చేరింది. అతనికి దగ్గరవ్వ డమే గాక 2021 మార్చి 13న గుంటూరులో వివాహం చేసుకుంది. ఇద్దరూ విశాఖపట్నం చేరుకొని.. జగదాంబ జంక్షన్ సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంది కాపరం పెట్టారు. . అతను ఓ కం పెనీలో ఆడిటర్ గా పనిచేసేవాడు. వెంకటలక్ష్మి మాయ మాటలు చెప్పి ప్రతీ నెలా జీతాన్ని తన అకౌంట్ నుం చి ఆమె అకౌం ట్కు లో వేయించుకొనేది. ఆయనకు పిత్రార్జితం గా వచ్చిన గుం టూరు జిల్లాలోని గోరింట్ల వద్ద డాబా ఇల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుం పేట మండలం లోని 12 సెం ట్ల ఖాళీ స్థలం ఆమె పేరిట తిరిగి రాయించుకొంది. ఇక ఒక పధకం ప్రకారం ఆరు నెలల గర్భంతో ఉన్న సమయంలో 3 తులాల బం గారం , బ్యాం కు అకౌం ట్లో ఉన్న సొమ్ము తీసుకొని అతనిని వదిలి ఇంట్లో నుండి వెళ్లిపోయిం ది. ఈ విషయమై గుం టూరు, భీమవరం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యా దు చేసాక .. పోలిసుల దర్యాప్తు లో ఆమె గురించి అందరు విస్తుపోయే అనేక వివరాలు వెలుగులోకి వచ్చా యి. భీమవరంలో ఇద్దరు, పాత గుం టూరులో ఒకరు, గుం టూరు శారదానగర్లో ఒకరు, విజయవాడ రాజేశ్వర నగర్ లో ఒకరు, గుంటూరు లో రిటైర్ ఆర్మీ ఉద్యోగిని ఆమె మోసగించినట్లు కేసు నమోదు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *