సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దసరా వేడుకల్లో భాగంగా భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు నేడు, ఆదివారం ‘శ్రీ సరస్వతి దేవి‘ గా దివ్య అలంకరణలో చేతిలో వీణా ధరించి జ్ఞాన స్వరూపిణిగా అస్సిసులు అందిస్తూ భక్తులకు, విద్యార్థులకు దర్శనమిచ్చారు. ఆదివారం కూడా కావడం తో దేవాలయ ఆవరణలో విశేషంగా సందడి వాతావరణం కనపడింది. ఆలయ ఆవరణలో చండి హోమం తో పాటు నేటి మధ్యాహ్నం నుండి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేటి రాత్రి తిరుపతి చెందిన కళాకారులతో సంగీత విభావరి నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *