సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దసరా వేడుకల్లో భాగంగా నేడు, ఆదివారం భీమవరం గునుపూడిలోని పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర్ దేవస్థానంలో శ్రీ పార్వతి అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అపూర్వ అలంకారంలో దర్శనం మివ్వగా, చంద్ర ప్రతిష్ట శివలింగం పైన అంతస్తులో ఉండే శ్రీ అన్నపూర్ణ అమ్మవారి కి వివాహిత మహిళకు, నిండు సౌభాగ్యం కు ప్రతీక, శుభకరం అయిన విశేషమైన వేలాది రంగురంగుల మట్టి గాజులతో అలంకరణ చెయ్యడం విశేషము. పురాణ ప్రాశస్యం ఉన్న దేవాలయం కావడం తో ఆదివారం ఎంతో దూరప్రాంతాల నుండి భక్తులు వాహనాలలో వచ్చి శ్రీ సోమేశ్వరుని, అమ్మవార్లను దర్శించుకొంటున్నారు.
