సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, ఆదివారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భీమవరం పట్టణంలో జేపీ రోడ్డు, ఉండి రోడ్డు కు జంక్షన్ ( బాంబే స్వీట్స్ వద్ద) సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ఆవిష్కరించారు. ఇకనుండి ఈ ప్రాంతం గాంధీ చౌక్ గా పిలువబడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా పరిషత్తు చైర్మెన్ కౌరు శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. అనంతరం, గాంధీ , లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి పునస్కరించుకొని వారి జీవితాలు ప్రజలు ఆదర్శం కావాలని పిలుపు నిస్తూ.. అక్కడ నుండి పట్టాన వీధుల గుండా నిర్వహించిన శాంతి సద్బావన ర్యాలీ లో శాసనమండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ , జడ్పీ చైర్మెన్, కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు
