సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నడిబొడ్డున స్థానిక ఇండియన్ బ్యాంకు రోడ్డులో ( మన సిగ్మా వెబ్ ఛానెల్ ఆఫీస్ వద్ద) సుమారు 150 ఏళ్ళ క్రితం వెలసిన మహీనిత ‘శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి జాతర మహోత్సవం మహర్నవమి సందర్భముగా నిన్న ప్రారంభమయి, నేటి, మంగళవారం తెల్లవారు జాము వరకు స్వామివారి నగర సంచారంతో ముగిసింది. గత రాత్రి శ్రీ స్వామివారికి మేళతాళాలతో , వీర శైవ నృచాలతో ,డప్పు వాయిద్యాలతో, బుట్టబొమ్మలా, ప్రభల కోలాహంతో జాతర నిర్వహించారు. ఇక్కడ నిష్ఠ తో ఉన్న భక్తుల కోసం రాత్రి 11 గంటలకు ఏర్పాటు చేసిన నిప్పుల కొలిమి తో ఏర్పాటు చేసే నిప్పుల గుండం లో భక్తులు ‘అసారభ అసారభ అంటూ నిప్పులనును తొక్కడం హైలైట్ గా నిల్చింది.తదుపరి నంది వాహనం ఎక్కి కాగడాలతో,మేళతాళాలతో , డప్పు వాయిద్యాలతో స్వామివారు నగర సంచారం చేయి తెల్లవారు జామున దేవాలయం కు తిరిగి రావడం తో జాతర ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *