సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఈరోజు విజయదశమి పర్వదినం నేపథ్యంలో భీమవరం పట్టణంలో పలు దేవి ఆలయాల్లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి అడ్జక్షుడు కొయ్యే మోషేను రాజు పాల్గొన్నారు. ముందుగా అయన గునుపూడి ఆదిలక్ష్మి పోలేరమ్మ గ్రామా దేవతకు బంగారు కిరీటం ధారణలో పాల్గొని ఆలయ మర్యాదలతో శ్రీ అమ్మవారి ఆశీస్సులు పొందారు. తదుపరి ఉదయం చాంబర్ ఆఫ్ కామర్స్ హల్ లో మార్వాడీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దుర్గామాత దసరా మహోత్సవం లో పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. భీమవరంలో మార్వాడీలు చక్కటి వ్యాపారంతో పాటూ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తక్కువ లాభంతో వ్యాపారం చేస్తారని శాంతీయుతంగా జీవనం సాగిస్తారని చెప్పారు వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *