సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి రైతుల పాదయాత్ర నేడు, గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి లో ప్రవేశించింది. ఈ నేపథ్యంలో వారికీ ఉండిలో స్థానిక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంతెన రామరాజు , శాసనమండలి సభ్యులు శ్రీనివాసరాజు స్వగతం పలికారు. ఈ పాదయాత్రలో ,ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మరియు పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ రైతు అధ్యక్షుడు పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి (తాడేపల్లి గూడెం) కూడా పాల్గొనడం అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించడం జరిగింది. రైతుల పాదయాత్ర ఉండి తరువాత జిల్లా కేంద్రం భీమవరం లో ప్రవేశించనుంది.
