సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ప్రకటించినప్పటి నుండి ఒక ప్రక్క ప్రభుత్వ నిధులు, మరో ప్రక్క దాతల సహకారం, ప్రముఖ విద్యాసంస్థల సహకారంతో పట్టణంలోని అన్ని ప్రాంతాలలో వరుసగా ఆధునిక సుందరీకరణ పనులు ఒకే సారి మొదలు కావడం దానికి వరుస భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురవడం తో పనులకు అడ్డంకి ఏర్పడినప్పటికీ మరింత సమయం తీసుకొన్న ఆధునీకరణ పనులలో వెనకడుగు పడటం లేదు. ( మరో 3 నెలలు లో వచ్చే సంక్రాంతి పండుగ కల్లా కచ్చితంగా అన్ని హంగులతో సరికొత్త భీమవరం సుందర నగరంగా ఆవిష్కారం జరుగుతుందని భావించవచ్చు..)ఈ నేపథ్యంలో బివి రాజు మరియు విష్ణు విద్యాసంస్థలకు వెళ్లే దారిలో భీమవరం పట్టణం శివారులో ఇప్పటికే భారీ ప్రారంభ ద్వారం బివి రాజు విద్య సంస్థల సహకారంతో ఏర్పాటు చేసారు. ఇక కొత్తగా బై పాస్ రోడ్డు జంక్షన్ బివి రాజు చౌక్ సెంటర్ వద్ద మరో భారీ స్వాగత ద్వారం విష్ణు విద్య సంస్థల ఆధ్వర్యంలో ప్రారంభానికి సిద్ధం అవుతున్న దృశ్యాలు మీరు ఫై చిత్రంలో చూడవచ్చు.. భీమవరం సుందరీకరణ లో భాగం గా విష్ణూ విద్య సంస్థలు ఆధ్వర్యంలో “మన భీమవరం” ప్రాజెక్టు లో భాగంగా అదే సెంటర్ లో మన భీమవరం డిజిటల్ బోర్డు మరియు అందాల వాటర్ ఫౌంటెన్ మరియు భారత జవాన్ నిబద్దత చాటుతూ విగ్రహాల ఏర్పాటు ఆ ప్రాంతానికి అతి త్వరలో మరింత శోభను చేకూర్చనుంది.
