సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికాలో ఎంత గొప్ప స్థాయికి వెళ్లిన.. మాతృభూమి శ్రేయస్సు కోరే ఓ డాక్టరమ్మ తాను వైద్య విద్య ను అభ్యసించిన ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు కళాశాలకు ఏకం గా రూ.20 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని కూచిపూడికి చెందిన డాక్టర్ గవిని వెంకటకృష్ణారావు రెండో కుమార్తె డాక్టర్ ఉమ గవిని. గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్య నభ్య సించారు. ఎక్కడో అమెరికాలో 40 ఏళ్ల కిందట వెళ్లి ఇమ్యునాలజిస్టు డాక్టర్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఆమె తన మూలాలు మరిచిపోకుండా గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యా ర్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింఖానా)కు అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం జింఖానా కోశాధికారిగా విధులు నిర్వహిస్తున్నా రు. గుంటూరు జీజీహెచ్లో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం (ఎం సీహెచ్)కి డాక్టర్ ఉమ గవిని విరాళం ప్రకటించారు. ఆమె దాతృత్వానికి , మంచి మనస్సుకు అందరు సెల్యూట్ చేయవలసిందే..
