సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ , పాన్ ఇండియా సినీ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చెయ్యడం అది క్వాలిటీ లేక అనేక విమర్శలు కు గురికావడం జరిగింది. ఈ ట్రోల్స్ ను కంట్రోల్ చెయ్యడానికి నష్ట నివారణ చర్యలు లో భాగంగా.. ఆదిపురుష్ 3డి వెర్షన్ లోని హై క్వాలిటీ ట్రైలర్ ను హైదరాబాద్ లో గత రాత్రి హీరో ప్రభాస్ మరోసారి థియేటర్ లో విడుదల చేసారు. ఈ టీజర్‌ త్రీడీ వెర్షన్‌ని హైదరాబాద్‌లో మీడియా కోసం ప్రదర్శించారు. తదుపరి ప్రభాస్ మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్‌ టీజర్‌ని తొలిసారి త్రీడీలో చూసినప్పుడు నేను చిన్నపిల్లాడ్ని అయిపోయా. నా సినిమా త్రీడీలో రావడం ఇదే తొలిసారి. ఆ విజువల్స్‌ చూసి థ్రిల్‌ ఫీల్‌ అయ్యా’’ నేటి శుక్రవారం నుండి తెలుగు రాష్ట్రాలలో అభిమానుల కోసం 60 థియేటర్లలో త్రీడీ టీజర్‌ని ప్రదర్శిస్తాం. వాళ్లు చూసి ఎలా ఫీల్‌ అవుతారో తెలుసుకోవాలని ఉంది. ఇలాంటి టెక్నాలజీతో సినిమా తీయడం దేశంలోనే ఇదే తొలిసారి. పెద్ద తెర కోసం తీసిన సినిమా ఇది. ఇంకొన్ని వారాల్లో మంచి కంటెంట్‌తో మళ్లీ వస్తామ’’న్నారు. దిల్‌ రాజు మాట్లాడుతూ ‘‘టీజర్‌ కోసం అందరిలా నేనూ ఎదురు చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ‘బాహుబలి’, ‘ఆదిపురుష్‌’లాంటి చిత్రాలు విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసమే చూడాలి. సెల్‌ఫోన్లలోనూ, బుల్లితెరపైనా టీజర్‌ చూసినవాళ్లకు నచ్చకపోవొచ్చు. త్రీడీ ఎఫెక్ట్‌లో చూస్తే ఆ అనుభూతి వేరు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *