సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాడుతెలంగాణ ప్రాంతంలో తెలుగు దేశం పార్టీలో ఒక వెలుగు వెలిగి తదుపరి టీఆర్ఎస్ లో చేరి ఎంపీ అయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఎంపీ నామాకు చెందిన రూ.80.65 కోట్లు విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. రాంచి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో రూ.73.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లుగా ఈడీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు కింద బ్యాంకు రుణాలుగా తీసుకున్న రూ.361.29 కోట్లను దారి మళ్ళించినట్లుగా ఈడీ నమోదు చేసిన కేసులో ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *