సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు , సోమవారం సాయంత్రం మాజీమంత్రి పేర్ని నాని మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. విశాఖ లో ఒక ప్రక్క ఆ ప్రాంత ప్రజలు పరిపాలన రాజధాని కోసం గర్జిస్తుంటే.. అక్కడ కలవాలని అక్కడ ప్రజలను రెచ్చగొట్టి అలజడి సృష్టించడం కోసం పవన్ వచ్చాడన్నారు. మీ కార్యకర్తలే సిగ్గుపడే విధంగా ఎప్పుడు చంద్రబాబు మాట భుజాన్న వేసుకొని ప్యాకేజీ తీసుకోని షూటింగ్ వదిలి విశాఖ వచ్చిన పవన్ కల్యాణ్ చేష్టలను ప్రజలంతా గమనించారు అని అన్నారు. అసలు పవన్ రాజకీయ నాయకుడా? లేక ఫ్యాక్షన్ ముఠా నడుపుతున్నారా? అంటూ విమర్శించారు. ప్రభుత్వ మంత్రుల మీద దాడులు చేసి అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తల కు అండగా ఉంటానని విశాఖ నుంచి కదలనని చెప్పి ఇప్పుడు ఎందుకు వెళ్లిపోయారు. పవన్ కల్యా ణ్ కు కూడా చంద్రబాబు లాగా మాట మీద నిలబడితే శాపం ఉందేమో’? పవన్ కు టీవీల నిండా, పేపర్ల నిండా వార్తలు కావాలి. మళ్లి రేపటి నుండి షూటింగ్లకు వెళ్లిపోవాలి.విలువలు, నిబద్ధత లేని వ్య క్తి అని పేర్ని నాని దుయ్య బట్టారు.‘‘ మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటున్నావు. నువ్వు చెడిపోయావ్ కాబట్టి అందరూ చెడిపోవాలని కోరుకుంటున్నావ్. మూడు కాకపోతే ముప్ప య్ పెళ్లిళ్లు చేసుకో! వదిలేసినవారికి భరణం ఇస్తున్నావ్.. కాకపోతే నీతి సూక్తులు చెప్పే టప్పు డు ఇలాంటి తప్పులు ఎవరు చేయకూడదని చెప్పాలి అని పేర్ని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *