సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రేమ కధ క్రైమ్ నిండిన పూర్తీ విషాదంగా మారిపోయి… తాజాగా నేడు,మంగళవారం ప్రియుని శవం దొరకడటం తో వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళ్ళితే .. ద్వారకాతిరుమల మండలం తూర్లలక్ష్మీపురానికి చెందిన పవన్‌కల్యాణ్ (24), గొడుగుపేటకు చెందిన శ్యామల(18) ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించేలేదన్న బాధతో శ్యామల పురుగులమందు తాగి జూన్ 5న ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి బాధనుండి తేరుకున్న ప్రియుడు పవన్ ఈ నెల 15వ తేదీ రాత్రి స్నేహితులతో కలసి పార్టీ చేసుకున్నాడు. ఆతర్వాత అతను ఎవరికీ కనపడలేదు.. ఏమిటి మిస్టరీ? అనుకొంటుండగా.. అయితే ఇటీవల శ్యామల సమాధికి సమీపంలో మరో సమాధి లాంటి ఆనవాళ్లను జంగారెడ్డిగూడెం పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.నేటి మంగళవారం ఉదయం ఆ ప్రాంతంలో పోలీసులు తవ్వకాలు చేపట్టి.. ప్రియుడు పవన్ మృతదేహాన్ని బయటకు తీశారు..ట్విస్ట్ ఏమిటంటే.. తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న, తన కుమార్తె శ్యామల ఆత్మహత్య కి పవన్ కళ్యాణ్ కారణమని భావించిన శ్యామల తండ్రి నాగేశ్వరరావు కక్ష పెంచుకుని పవన్‌ను దారుణంగా కొట్టి హత్య చేసి శ్యామల సమాధి సమీప ప్రాంతంలో పూడ్చిపెట్టారని పోలీసులు భావిస్తున్నారు.
