సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, మంగళవారం మంగళగిరి లో జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేశంతో వైసిపి నేతలను బూతులు తిడుతూ, వారికీ చెప్పు చూపించడం అందరిని షాక్ కు గురి చేసింది. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వీడు నీరసంగా బలహీనంగా ఉంటాడు.. అనుకుంటున్నారేమో? ఇకపై తనను ప్యాకేజీ స్టార్ అనే వెధవల్ని చెప్పుతో కొడతానని చెప్పు చూపించి మరీ పవన్ హెచ్చరించారు. వైసిపి వాళ్ళు నా ఎదురుగ వచ్చి.. ప్యాకేజీ అనే సన్నాసుల్లారా ..ఒంటి చేత్తో మెడ పిసికి చంపేస్తానని, ఒక్కక్క .. కొడుకుల తోలు నిలబెట్టి ఒలిచేస్తాను.. తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదని మండిపడ్డారు. మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నానంటున్నారని, ‘మీరూ చేసుకోండ్రా.. ఎవడొద్దన్నారు?’ నా మొదటి భార్య కు విడాకులు ఇవ్వడానికి 5 కోట్లు ఇచ్చాను.. ఇక రెండో ఆవిడకు ఆస్తి ఇచ్చాను..ఒరెయ్ వెధవల్లారా నేను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకెందుకురా? మీలా ఒక పెళ్ళి చేసుకుని 30 స్టెఫ్నీలతో..’ అని విరుచుకుపడ్డారు. ‘లండన్, న్యూయార్క్‌లో పెరిగాననుకుంటున్నారా? బాపట్లలో పుట్టా.. గొడ్డు కారం తిని పెరిగా’ అని పవన్ చేసిన వ్యాఖ్యలకు కార్యకర్తల మరింత జోష్ చూపించారు..‘వైసీపీతో నేను యుద్ధానికి సిద్ధం.. రాడ్‌లతోనా.. హాకీ స్టిక్కులతోనా.. దేంతోనైనా రండి తేల్చుకుందాం.. నేటి నుంచి యుద్ధమే.. మీరు రెడీనా’ అని పవన్ కళ్యాణ్ సవాళ్లు విసిరారు.
