సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కృష్ణ జిల్లా, ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లాలో 2012లో దక్షిణ మధ్య రైల్వే రూ.3 వేల కోట్లతో ప్రాజెక్టు గా 221 కిలోమీటర్లమేర…చేపట్టిన డబుల్‌లైన్, విద్యు దీకరణ పనులు మొత్తం 5 దశలవారికి అనేక కష్టాలకు ఓర్చి తాజగా పూర్తీ చేసారు. ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లాలో మొత్తం 63.8 కిలోమీటర్లమేర విద్యు త్ లైన్ల పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు భీమవరం నుండి విజయవాడ వరకు కరెంట్ ఇంజన్ రైళ్లు నడుస్తున్నాయి. ఇకపై భీమవరం నుండి నిడదవోలు మీదుగా రాజమండ్రి వైపు కూడా ఇక కరెంట్ ట్రైన్లు అతివేగంగా పరుగులు పెట్టనున్నాయి. పూర్తిస్థాయిలో డబుల్‌లైన్, విద్యుదీకరణ అందుబాటులోకి వచ్చింది. ఇటీవల భీమవరం సమీపంలోని ఆరవల్లి నుండి తణుకుమీదుగా నిడదవోలు వరకు 32.8 కిలోమీటర్లు మేర డబుల్ లైన్ ట్రాక్ వేయడంతో పాటు విద్యుత్దీకరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. దీంతో ఈనెల 14న ఆరవల్లి–నిడదవోలు విద్యుత్ లైన్ ను రైల్వే అధికారులు ప్రారంభించారు. దీంతో ప్రాజెక్టు పనులుఅన్ని దశల్లోనూ పూర్తయినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇకపై గోదావరి జిల్లాల ప్రయాణికులు వేగంగా గమ్యాలను చేరుకోవచ్చు..
