సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూర్యగ్రహణం సందర్భంగా భీమవరం పట్టణంలో అన్ని ప్రముఖ దేవాలయాలు ఈ నెల 25న ఉదయం 10గంటల నుండి మూసివేయనున్నట్లు.. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనాలు చేసుకోవాలని దేవాలయ ఇఓ లు పలు ప్రకటనలలో తెలిపారు. ఈ నేపథ్యంలో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ ఒక ప్రకటనలో 25వ ఉదయం 10 నుండి మూసివేసిన ఆలయం మరుసటి రోజు 26వ తేదీన దేవాలయంలో వేదపండితులచే సంప్రోక్షణ అనంతరం ఉదయం 9 గం టల నుంచి భక్తులను శ్రీ అమ్మ వారి దర్శనానికి అనుమతిస్తామన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *