సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లోని వెంకట్రామ థియేటర్లో నేడు, ఆదివారం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక వెంకట్రామ థియేటర్ లో బిల్లా 4కే సినిమాను రీరిలీజ్ చేశారు.నిజానికి ఇటీవల చాలాకాలంగా మూతబడిన ఈ థియేటర్లో ప్రభాస్ అభిమానుల కోరిక మేరకు బిల్లా స్పెషల్ షో వేయించారు. అయితే కొందరు అభిమానులు అభిమానం హద్దులు దాటి సినిమా చూస్తూ దూకుడుగా థియేటర్లో బాణసంచా పేల్చ డం తో సీట్లకు పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నా యి. ( ఫై దృశ్యంలో చూడవచ్చు)దీంతో అభిమానులు బయటకు పరుగు తీశారు. అయితే అలర్ట్ అయిన థియేటర్ యాజమాన్యం , కొందరు అభిమానులు సహకారంతో మంటలు ఆర్పేశారు. లేకపోతె పెద్ద అగ్ని ప్రమాదం జరిగి ఉండేది
