సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం ఉదయం విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుధరాయవలస గ్రామంలో కోనేటిలో స్నానం చేసేందుకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. బుధరాయవలస గ్రామానికి చెందిన ఏడుగురు విద్యార్థులు స్నానం చేసేందుకని కోనేటి వద్దకు వెళ్లారు. వారిలో ఒకరు స్నానం చేసేందుకు నీటిలోకి దిగాడు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి నీటిలో మునిగిపోయాడు. అతడిని గమనించిన మరో ఇద్దరు విద్యార్థులు వెంటనే కాపాడేందుకు కోనేటిలోకి దిగారు. అయితే ఊహించని విధంగా ముగ్గురూ కూడా నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. కొద్దిసేపటికి ఊపిరాడక పోవడంతో భయంతో కేకలు వేశారు. దానితో అక్కడే ఉన్న మిగతా విద్యార్థులు వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు హుటాహుటిన కోనేటి వద్దకు చేరుకుని నీట మునిగికి విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే వారు మృతి చెందారు. మృతులను చందు, వెంకటేష్, హేమచందర్‌రావుగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *