సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడుతున్న సూర్యగ్రహణం, మన దేశంలో పాక్షికం అయినప్పటికీ దాదాపు రెండు దశాబ్దాలు తర్వాత అరుదైన సూర్య గ్రహణం గా వేద పండితులు గుర్తించారు. ఇది ఎంతో ప్రభావవంతమైన కేతు గ్రస్త సూర్య గ్రహణంగా వారు పేర్కొంటున్నారు. సహజంగా రాహు, కేతు ప్రభావంతో ఏర్పడే గ్రహణాల్లోరాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహు గ్రస్తమని, కేతుప్రభావం తో ఏర్పడే దానిని కేతు గ్రస్తమని అంటారు. తెలుగు రాష్ట్రాలపై సూర్య గ్రహణం సాయం త్రం 4 గం టల 29 నిమిషాలకు ప్రారంభమై సూర్యా స్తమయం తర్వాత కూడా దీని ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే బలంగా ఈ గ్రహణ కాలం దాదాపు 1గంట 15 నిముషాలు పాటు ఉంటుందని పంచాగకర్తలు చెబుతున్నా రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *