సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక గత రాత్రి భీమవరంలో ఘనంగా జరిగింది. హీరో రవితేజ బాలనటి తో కలసి స్టేజి ఫై స్టెప్స్ వేసి అలరించారు. అయితే కేవలం 5 నిముషాలు మాత్రమే మాట్లాడి కొంత నిరాశపరిచారు. తాను ఈ జిల్లా వాడినేనని భీమవరం డి ఎన్ ఆర్ కాలేజీ దగ్గర తన తాత గారి వద్ద 8 నెలలు నివాసం కూడా ఉన్నానని ఇది లక్కీ ప్లేస్ అని అందుకే ఇరుముడి కి ఇక్కడకు వచ్చానని, సంక్రాంతి కోడి పందాలకు ఈసారి భీమవరం వస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రవితేజ తనకు కజిన్ అని, ఇద్దరం కలిసి విజయవాడలో చాల సంవత్సరాలు కలిసే పెరిగామని తెలిపారు. ఎవరి సహాయం లేకుండా సొంత కష్టంతో ఎదిగి స్టార్ హీరోగా మారిన రవితేజ తమ పశ్చిమ గోదావరి జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. ఒకప్పుడు టాలీవుడ్ అంటే కృష్ణా, గుంటూరు అనేవారని, ఇప్పుడు వెస్ట్ గోదావరి అంటున్నారని ప్రభాస్ గారు,చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు ఇలా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎంతోమంది అద్భుతమైన హీరోలుగా ‘హావ’ నడుపుతున్నారని అన్నారు. ఇరుముడి రవితేజ గారికి మరో పెద్ద హిట్ అవుతుంది. ఈ వేడుకకు రావడం, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం నిజంగా చాలా మెమొరబుల్ మూమెంట్. నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది” అని అన్నారు.’
