సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నేడు, మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను ఇంకా మార్గదర్శి చిట్ పండ్ ఫై పోరాడుతూనే ఉన్నానని .. అయితే ఇప్పటికే మార్గదర్శి కేసు 16 ఏళ్ళు పూర్తయిందని, మార్గదర్శిని తనిఖీ చేయకుండా ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నమిగతా ఛిట్ పండ్ కంపెనీలన్నీ తనిఖీ చేస్తే ప్రయోజనం ఉండదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అసలు ఛిట్ పండ్ కంపెనీ నిర్వహించేవారు ఏ వ్యాపారం చేయకూడదనే నిబంధన ఉందన్నారు. నిజానికి చట్టం తని పని తాను చేస్తుందనేది పచ్చి అబద్దమన్నారు. రామోజీరావుకు ఛిట్ పండ్ కంపెనీకు సంబంధం ఉందా? లేదా? అనేది ప్రభుత్వం నిర్థారించాలన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నీ జగన్ ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. చట్టాలకు రామోజీరావు అతీతుడు కాదన్న విషయం జనం తెలుసుకోవాలన్నారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ చట్టాలను ఎలా మలుపు తిప్పచ్చో మార్గదర్శి కేసే ఉదాహణ అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. దీనిపై త్వరలో పుస్తకం రాస్తానన్నారు. మార్గదర్శి కేసు తేలేసరికి రామోజీరావు, తాను బ్రతికి ఉంటామో లేదో?అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చాలెంజ్ చేస్తూ వేసిన ఫిటిషన్తో పాటు అమరావతి రాజదాని పిటీషన్లపై సుప్రీంకోర్టులో ఈనెల 14న విచారణ జరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు విచారణకు స్వయంగా హాజరవుతానని ఉండవల్లి అన్నారు.
