సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటనకు నిరసనగా వామపక్షాల రాష్ట్ర వ్యాపిత పిలుపుమేరకునేడు, శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్ వద్ద సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ఏపీకి అన్యాయం చేసిన మోడీ గోబ్యాక్ అంటూ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన,ధర్నా నిర్వహించారు.ధర్నానుద్దేశించి నాయకులు మాట్లాడుతూ…రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పూనుకుంటూ రాష్ట్రానికి పదే పదే అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి రాష్ట్రంలో పర్యటించే నైతిక అర్హత లేదని..నరేంద్రమోడీని నిలదీయకుండా వైసిపి, టిడిపి,జనసేన పార్టీలు మోడీ అడుగులకు మడుగులొత్తడాన్ని రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటారన్నారన్నారు. సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకుడు దండు శ్రీనివాసరాజు, సీపీఐ భీమవరం పట్టణ కార్యదర్శి సి.హెచ్ రంగారావు, సీపీఎం నాయకులు జెఎన్వీ గోపాలన్,పి.వాసుదేవరావు మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి,పాలొన్నారు.
