సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ కు సరిహద్దులో ఉండే తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేటి ఆదివారం ఉదయం ట్రాక్టర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాల లోకివెళ్ళితే… . అయ్యప్ప స్వాములు పడిపూజకు వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టిం ది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్లో 33 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం . కాగా, దారుణ ఘటనలో ఐదుగురు మృతిచెం దగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉన్నట్టు సమాచారం…
.
