సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ పట్టణ నూతన కార్యవర్గ సభ్యులు ను ఎన్నుకొంది. భీమవరం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ లు ఇతర కార్యవర్గ సభ్యులు నేడు, గురువారం స్థానిక జనసేన ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ను మర్యాద పూర్వకముగా కలిశారు. పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని, ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, కూటమి బలోపేతానికి కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన సభ్యులను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. అనంతరం వారు ఎమ్మెల్యే అంజిబాబు ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు గంటా త్రిమూర్తులు, మైలబత్తుల ఐజాక్ బాబు, కారుమూరి సత్యనారాయణ మూర్తి, దొంగ వెంకటేశ్వరరావు కూటమి నాయకులు పాల్గొన్నారు.
