సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం జూన్ 5 ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా భీమవరం 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అడ్వాకెట్స్ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) M.సుధారాణి, 2వ అదనపు మేజిస్ట్రేట్, N.జ్యోతి పాల్గొని మొక్కలు నాటారు. న్యాయమూర్తి సుధారాణి మాట్లాడుతూ.. మనం పచ్చని పకృతిని రక్షించుకోవాలని, మొక్కలకు హాని చేస్తే అవి ఇచ్చే ఆక్సిజన్,ఆహారం, మందులు,గృహవసతి, దుస్తులు లేకుండా మనం బ్రతకలేం.. ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు 2వ తరగతి మేజిస్ట్రేట్ నాగరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి యోహాన్ (న్యూటన్), సంయుక్త కార్యదర్శి జవ్వాది సత్తిబాబు, AGP వరప్రసాద్, న్యాయవాదులు మోగంటి శివకృష్ణ, V.V.సుబ్బారావు, ప్యానల్ న్యాయవాదులు B.సురేష్ కుమార్, P.అంబేద్కర్, D.రవికిరణ్, K.జ్యోతి, పారా లీగల్ వాలంటీర్లు V.శ్రీలక్ష్మి, K.చంద్రరావు, P.సూర్యనారాయణ, S.సత్యనారాయణ రాజు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *