సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ నేడు, బుధవారం మధ్యాహ్నం ఎన్నికల రాష్ట్ర కమిషన్ విడుదల చేసింది. . ముఖ్యంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తొలిదశలో పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు కలిపి మొత్తం 100 అర్బన్ లోకల్ బాడీస్కు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. ఈనెల 19న నామినేషన్ల స్క్రూటినీ చేయనున్నారు. ఈనెల 21లోపు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఈనెల 28న ఎన్నికలు జరగనుండగా.. 30వ తేదీన ఫలితాలను వెల్లడికానున్నాయి ఇక నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వాహిస్తారు. ఇక నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఇక పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. నవంబర్ 26న తొలిదశ 29న రెండవ దశ పంచాయతీ ఎన్నికలు, డిసెంబర్ 2న మూడోదశ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి పంచాయతీలకు ఎన్నికల రోజే ఫలితాలు విడుదల చేస్తారు.
