సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. తాజగా కాం ట్రాక్ట్ పద్ధతిలో ప్రభుత్వాస్పత్రుల్లోని 461 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి వైద్య , ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు జోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నేటి బుధవారం నుంచి వచ్చే డిసెంబర్ 5 వరకు http://cfw.ap.nic.in (http://cfw.ap.nic.in) వెబ్ సైట్ లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా వైద్య ,ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ కార్యా లయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. జీఎన్ఎం /బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి 42 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్ అభ్య ర్థులకు ఐదేళ్లు, ఎక్స్ –సర్వీస్మెన్లకు మూడేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు 10 ఏళ్ల పాటు వయోపరిమితి నుంచి సడలింపు ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుమును రూ.500గా, ఎస్సీ , ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ.300గా నిర్దేశిం చారు.
