సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ వాట్సాప్‌ గవర్నెన్స్‌-మన మిత్ర సేవలు అందుతాయని, ప్రజలు అందరూ 9552300009 సేవ్‌ చేసుకునేలా కలెక్టర్లు విస్తృత ప్రచారం చేయాలని ఐటీ, ఆర్టీజీఎస్‌ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ చెప్పారు. వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు లో వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రస్తుతం 210 ప్రభుత్వ సేవలు అందుతున్నాయని, మరో 15 రోజుల్లో 350 సేవలు అందుతాయని భాస్కర్‌ వెల్లడించారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ వినియోగంపై నిరంతర శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం కార్యక్రమం కార్యాచరణ దాదాపు పూర్తయిందని తెలిపారు.. యువత నైపుణ్య స్థాయిని బట్టి వారికి శిక్షణా కార్యక్రమాలు కూడా ఇస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *