సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల పెరిగిన కొత్త జిల్లాలకు అదనపు అధికారులు ఏర్పాటు చెయ్యవలసిన అవసరాల దృష్ట్యా తాజా సమాచారం ప్రకారం 66 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోషన్లు కల్పిస్తూ రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఈ మేరకు ఇప్పటికే శాఖాపరమైన పదోన్నతుల కమిటీ(డీపీసీ) జాబితాను ఆమోదించినట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 192 మంది పేర్లను పరిశీలించారు. వారిపై గతంలో ఉన్న క్రమశిక్షణ చర్యలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దూరంగా పెట్టి మిగతావారికి ప్రమోషన్ ఇవ్వడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ 66మందిగల జాబితాను ఆమోదించినట్లు ఇక అధికారిక ఉత్తర్వులు వెలువడటమే తరువాయి అంటున్నారు.
