సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర విభజనతో విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసి గత 10 ఏళ్లుగా కళ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తెచ్చేందుకు విజయవాడలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నేడు, ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.రఘువీరా రెడ్డి , కే విపి రామచంద్రరావు తదితర సీనియర్ నేతలు, కార్యకర్తల హర్ష ధ్వానాల మధ్య షర్మిల బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన గిడుగు రుద్రరాజుకు ఢిల్లీ నుండి షర్మిల నియామక ఆర్డర్ కాపీని అందజేయగా..ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు షర్మిలకు అభినందనలు తెలియజేశారు. ఇప్పటికే అధికార వైసిపి పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..తాజాగా వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి వైఎస్ షర్మిల సాదరంగా ఆయనను ఆహ్వానించారు. ఈ క్రమంలో త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో తన కాన్వాయ్ ను పోలీసులు అపారని ఆరోపిస్తూ షర్మిల మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని చూసి ఏపీలో జగన్ సర్కార్ భయపడుతోందని మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా ఏపీని పాలించిన ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాయని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *