సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియలో అభ్యర్థులకు కొత్త నిబంధనలు ఎదురయి వారి కొత్త ఉద్యోగానికి ఎసరు పెడుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. 2022లో అప్పటి జగన్ సర్కార్ హయాంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే ఈ నోటిఫికేషన్‌లో జనరల్, బీసీ అభ్యర్థులకు వయోనిబంధన కింద 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు ఉండాలని, ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,03,487 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వారికీ 2023 జనవరి 22న వీరందరికీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఇందులో 91,507 మంది అర్హత సాధించారు. అనంతరం హోమ్ గార్డులు తమ సర్వీస్‌ను కూడా ఈ పోస్టులకు పరిగణనలోకి తీసుకోవాలంటూ హైకోర్టులో కొందరు విచారణకు పట్టారు.. దానితో వాయిదా పడిన దేహదారుఢ్య పిట్ నెస్ పరీక్షలు కొత్త ఏడాది ప్రారంభంలో మొదలైనాయి. అయితే ఇంతలో కూటమి సర్కార్ రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసి, ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారిలో దాదాపు 1500 మందికిపైగా అభ్యర్థులను వయసు పెరిగిన కారణంగా అనర్హులుగా ప్రకటించింది. వీరందరికీ అంటే జనరల్, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయసు 27 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయసు 32 ఏళ్ల పరిమితి దాటిపోయిందని వారిని దేహదారుఢ్య పరీక్షలకు APSLPRB బోర్డు అనుమతించలేదు..దీనితో అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యి తమ ఆశలు అడియాసలు చెయ్యవద్దని ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.
