సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు ఆదివారం అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాప్తాడులో జరిగిన ‘సిద్ధం ’ బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో పెద్ద బహిరంగ సభ గా దీనిని అభివర్ణించవచ్చు. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. ఎర్రటి ఎండలో మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం వరకు జరిగిన సభలో సీఎం జగన్ తాను అనంతపురంలో సముద్రం చూడలేదు కానీ జన సముద్రాన్ని చూస్తున్నానని హర్షం ప్రకటించారు. ఇప్పటికే భీమిలి, దెందులూరులో భారీ బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ.. రాప్తాడులోని ఆటోనగర్ వద్ద 110 ఎకరాల్లో సిద్ధం సభను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సభ జరిగిన తీరు జాతీయస్థాయి మీడియాలో కీలక చర్చకు దారితీసింది. సభకు వచ్చిన జనం పార్టీ కార్యాకర్తల వీడియోలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో భారీ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ‘సిద్ధం ’ కార్యక్రమం ట్రెండింగ్లో నిలిచింది. ఎక్స్ (ట్విట్టర్)లో దేశం లోనే మొదటిస్థానంలో సిద్ధం ’ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సిద్ధం అప్డేట్స్ ను వైఎస్సార్సీపీ అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు. సభ పరిసర ప్రాంతాల్లో 16 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. వేలాది వాహనాలతో ఆ పార్కింగ్ లు నిండిపోయాయి. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *