సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలీసెట్ 2025 ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెలలో విడుదలైన ఏపీ పాలిసెట్ 2025 ఫలితాల్లో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరందరికీ కౌన్సెలింగ్ సీట్లు కేటాయించనున్నారుతాజా నోటిఫికేషన్ ప్రకారం.. జూన్ 20వ తేదీ నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ (మొదటి విడత) వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. మొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ అభ్యర్థుల వరకు ఫీజు చెల్లించడానికి జూన్ 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.250 చొప్పున చెల్లించాలి. ధ్రువపత్రాల పరిశీలన జూన్ 21 నుంచి 28 వరకు ఉంటుంది. కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు జూన్ 25 నుంచి 30 వరకు అవకాశం కల్పించింది. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 4 నుంచి 8 లోపు కళాశాలల్లో చేరాలని సూచించింది.
